Friday, June 5, 2026
Homeఆదిలాబాద్Chandrababu | ఆక్వా రంగం అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది..

Chandrababu | ఆక్వా రంగం అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది..

  • వైజాగ్ లో సి ఫ్రూడ్ ఎగుమతుల జాతీయ వర్క్ షాప్..
  • ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు..

భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదేనని, భారతదేశ బ్లూ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో ఆక్వా రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీ-ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆక్వా రంగ అభివృద్ధికి తన ప్రభుత్వ దార్శనికతను, భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు.

భారతదేశ సముద్ర ఆహార ఉత్పత్తిలో, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు గణాంకాలతో వివరించారు. “దేశ మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28 శాతం, రొయ్యల ఉత్పత్తిలో ఏకంగా 66 శాతం మనదే. దేశ సముద్ర ఆహార ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 38 శాతం, అంటే సుమారు రూ.28,000 కోట్లకు పైగా ఏపీ నుంచే సమకూరుతోంది. ప్రపంచ సీ-ఫుడ్ వ్యాపారంలో భారత్ వాటా కేవలం 5 శాతమే ఉంది. దీన్ని పెంచడానికి అపార అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే, దేశ ఎగుమతులు కూడా వృద్ధి చెందుతాయి” అని ఆయన అన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆక్వా రంగం సమగ్రాభివృద్ధికి ఒక బృహత్ ప్రణాళికను చంద్రబాబు ప్రకటించారు. అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, నెల్లూరు ప్రాంతాలను కలుపుతూ ఒక ‘ఆక్వా కారిడార్’ అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News