- విగ్రహానికి పూల మాల వేసి మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష తో కలిసి కంది శ్రీనివాస రెడ్డి నివాళి
- ఆమె సేవలను కొనియాడిన నేత
ఆదిలాబాద్: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నాడు నిజాం రజాకార్లకు, భూస్వాములకు ఎదురొడ్డి నిలిచిన ధీరవనిత చాకలి ఐలమ్మ(Chakali Ailamma) అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి కొనియాడారు. ఆమె జయంతిని పుస్కరించుకొని శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ వద్ద గల ఐలమ్మ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు.
బడుగు బలహీన అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆమె ఎంతో కృషి చేసారని గుర్తు చేసారు. ఆమె ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్ , ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, నాయకులు శాంతన్ రావు, కొండా గంగాధర్, రఫిక్, విట్టల్ రెడ్డి, షకీల్, సంటెన్న,ప్రభాకర్,సాహెబ్ రావు,భోరజ్ మండల నాయకులు బత్తుల శ్రీనివాస్, దీపక్ రావు, ప్రకాష్, అశోక్, నారాయణ, రాజన్న రజక సంఘం నాయకులు చిక్కాల దత్తు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
