- నిపుణులు వెల్లడిస్తున్న అంశాలు..
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చపాతీలను నేరుగా గ్యాస్ మంటపై కాల్చడం వల్ల లేదా అవి మాడిపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనే వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వార్త ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించడంతో, వైద్య నిపుణులు, ఆంకాలజిస్ట్‌లు దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని వెల్లడించారు.
నిపుణుల ప్రకారం..పిండి పదార్థాలు కలిగిన చపాతీలు, రొట్టెలు లేదా బంగాళాదుంపలు వంటి ఆహారాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వండినప్పుడు లేదా అవి నల్లగా మాడినప్పుడు వాటిలో అక్రిలామైడ్, హెటెరోసైక్లిక్ అమైన్‌లు, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు వంటి రసాయనాలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. జంతువులపై జరిపిన కొన్ని ప్రయోగశాల అధ్యయనాలలో ఈ రసాయనాలు శరీరంలో చేరడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇదే విషయాన్ని కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, హోమియోపతి వైద్యులు ప్రస్తావిస్తూ, మాడిన చపాతీలు తింటే క్యాన్సర్ వస్తుందని హెచ్చరించడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.
