Saturday, May 30, 2026
Homeరంగారెడ్డిTragedy | స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడి మృతి

Tragedy | స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడి మృతి

మొయినాబాద్ మున్సిపాలిటీ చిలుకూరు పరిధిలోని మృగవని రిసార్ట్ లో సోమవారం హైదరాబాద్ కు చెందిన ఓ జంట వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు లింగంపల్లికి చెందిన ప్రకాష్ సింగ్ ప్యామిలీతో కలిసి హాజరయ్యారు. పేరెంట్స్ పెళ్లి వేడుకలో ఉండగా వీరి కొడుకు సూర్యప్రకాష్ (10) ఆడుకుంటూ స్విమ్మింగ్ వద్దకు వెళ్లి అందులో జారి పడ్డాడు. ఈత రాకపోవడంతో నీట మునిగాడు. బంధువులు గమనించి బయటకు తీసి వెంటనే రిసార్ట్ సిబ్బంది సాయంతో భాస్కర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై ఎవరు ఫిర్యాదు చేయకపోవడం తో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News