Saturday, April 25, 2026
Homeమెదక్‌BG Venkatapur | రాష్ట్రంలో గొప్ప పంచాయితీగా తీర్చి దిద్దటమే లక్ష్యం

BG Venkatapur | రాష్ట్రంలో గొప్ప పంచాయితీగా తీర్చి దిద్దటమే లక్ష్యం

  • గ్రామ సర్పంచ్ చెక్కల పరమేశ్వర్
  • ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గ్రామ ప్రజలకు అందేలా కృషి చేస్తా
  • కలసికట్టుగా పని చేద్దాం.. గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం..

రాష్ట్రంలో గొప్ప పంచాయితీగా తీర్చిదిద్దడమే తన జీవిత లక్ష్యం అని. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరేలా కృషి చేస్తానని. మనమంతా కలిసికట్టుగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిద్దామని బిజీ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ చెక్కల పరమేశ్వర్ పిలుపునిచ్చారు.శుక్రవారం రోజున జగదేవపూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ పరమేశ్వర్ మాట్లాడుతూ…

​పంచాయతీరాజ్ ప్రాముఖ్యత: “భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంది” అన్న గాంధీజీ మాటలను గుర్తు చేస్తూ, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. ​గత ఏడాది కాలంలో గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల్లో భాగంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను ఆయన గ్రామ ప్రజలకు వివరించారు.
​అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే తన లక్ష్యం అని కూడా స్పష్టం చేశారు.

- Advertisement -

​దీనికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో కేవలం పాలకవర్గం మాత్రమే కాకుండా, గ్రామస్తులందరి సహకారం ఎంతో అవసరమని దీనికి సహకరించాలని కోరారు ఆయన. అంతేకాకుండా గ్రామంలో పచ్చదనం పెంచడం (హరితహారం), స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చెత్త రహిత గ్రామంగా మార్చడం, త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడటమే తన తదుపరి లక్ష్యమని అన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే గ్రామాలకు నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.

మన పంచాయతీని రాష్ట్రంలోనే ఒక గొప్ప పంచాయతీగా నిలబెట్టడానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేద్దాం” అని పిలుపునిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ​ఈ సమావేశంలో ఉప సర్పంచ్ బాబు , పంచాయతీ కార్యదర్శి తిరుపతి,వార్డు సభ్యులు సుధాకర్, బాలరాజు,రవి యాదగిరి, నీల మాదవి, కారింగుల బాలమణి , గుండమైన కనకమ్మ గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News