Homeమెదక్‌Bhagyalakshmi Temple | భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Bhagyalakshmi Temple | భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సదాశివపేట: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ హైదరాబాద్‌లోని చారిత్రక శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని(Bhagyalakshmi Temple) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అనంతరం అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

- Advertisement -

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజల్లో సంతోషం, ఐక్యత, సోదరభావాన్ని మరింత పెంపొందించాలని పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో నాయకులు జైపాల్ రెడ్డి. మల్లేశం , గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News