బాన్సువాడ పట్టణ కేంద్రంలోని బి.సి. బాలికల వసతి గృహాన్ని (B.C. Girls Hostel) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు (Banswada MLA) పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ (Inspection) చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినుల(Students)తో మాట్లాడుతూ.. వసతి గృహంలోని సౌకర్యాలు, ఆహార నాణ్యత, పఠన వాతావరణం గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరైన పోషకాహారం అందేలా మెను (Menu) ప్రకారం వండాలని సిబ్బందికి సూచించారు.

విద్యార్థులు క్రమశిక్షణగా ఉండి బాగా చదివి మంచి పేరు సంపాదించాలని చెప్పారు. ఇటీవలే ఎస్టీ బాలికల వసతి గృహ విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సు (Special Bus) సౌకర్యం ఏర్పాటుచేయించిన విషయం తెలిసిందే. ఆ బస్సు సాయంత్రం సకాలంలో వస్తుందో లేదో స్వయంగా నిర్ధారించుకోవడం కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి జూనియర్ కళాశాలలో బస్సు వచ్చేంత వరకు వేచి ఉన్నారు. బస్సు రాగానే విద్యార్థినులు సురక్షితంగా వసతి గృహానికి చేరుకునే వరకు పర్యవేక్షించారు. విద్యార్థుల సంక్షేమంపై పోచారం చూపిస్తున్న వ్యక్తిగత శ్రద్ధ.. తల్లిదండ్రులు, సిబ్బంది అభినందనలు పొందింది.

