Wednesday, January 14, 2026
EPAPER
Homeఆదాబ్ ప్రత్యేకంGhmc | ఖానామెట్‌లో అక్రమ నిర్మాణంపై చర్యలు

Ghmc | ఖానామెట్‌లో అక్రమ నిర్మాణంపై చర్యలు

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణం సీజ్
సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరిక

ఖానామెట్‌(Khanamet)లో ప్రభుత్వ నిబంధనల(Government Rules)కు విరుద్ధంగా నిర్మించిన భారీ అక్రమ నిర్మాణం(Illegal Construction)పై జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. వారి సమాచారం మేరకు సర్వే నంబర్లు 41/12, 41/13లోని ప్లాట్ నంబర్లు 32, 34లో ఇద్దరు వ్యక్తులు ఫైల్ నంబర్ 394734, 394725 ద్వారా విడివిడిగా G+2 అంతస్తులకు మాత్రమే అనుమతులు పొందినప్పటికీ నిబంధనలను ధిక్కరించి 2 ప్లాట్లను కలిపి సెల్లార్‌+6 అంతస్తుల భవనం(సెల్లార్+6)గా నిర్మాణం చేపట్టారు.

- Advertisement -

గతంలో ఈ అక్రమ నిర్మాణంపై స్పీకింగ్ ఆర్డర్ (Speaking Order) జారీ చేసినప్పటికీ నిర్మాణదారులు వాటిని పట్టించుకోకుండా పనులను కొనసాగించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో చందానగర్ సర్కిల్‌ (Chanda Nagar Circle) టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు రమేష్ తదితరులు గురువారం స్థలాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాన్ని సీజ్‌ చేశారు. అక్రమ నిర్మాణంపై, ఉల్లంఘనపై తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకోనున్నట్లు జీహెచ్‌ఎంసీ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News