- జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి.
రైతులు సాంప్రదాయమైన వరి సాగుపై కాకుండా అట్టివారి పెంపకంపై దృష్టి సారించాలని కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం తాడ్వాయి మండలంలోని ఎర్రపహడ్ గ్రామంలో, గ్రామానికి చెందిన సాకలి రామస్వామి అట్టివారి సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ సాధారణ వరికంటే అట్టి వరి చాలా తక్కువగా నీరు తీసుకుంటుందని, పెట్టుబడి భారం చాలా తగ్గుతుందని, సాధారణ వరితో పోల్చుకుంటే తొందరగా కోతకు వస్తుందని, ఇది అన్ని రకాలుగా రైతుకు మేలు చేస్తుందన్నారు.


అట్టి వరిలో సాధారణ వరితో పోల్చుకుంటే కలుపు ఎక్కువగా పెరుగుతుందని దాని నివారణకు సంబంధించిన మందులు మార్కెట్లో అందుబాటులు ఉన్నాయని అవి వాడడం వల్ల కలుపు మొక్కల నివారణ కూడా తగ్గుతుందన్నారు. అట్టివరి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందవచ్చునని, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తాడ్వాయి మండలంలో అట్టివారి సాగు పెరిగిందని మండలంలో భూముల పరిస్థితికి తగ్గట్టుగా వట్టి వరి అనుకూలమైనదని దీనిపై రైతులు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ సుధా మాధురి పీడీ ఆత్మ మహిత, డిఎన్ఓ విజయభారతి ఎన్జీవో కైలాష్, ఏవో నరసింహులు, ఏఈవోలు శివ చైతన్య, అశోక్ రెడ్డి, ప్రశాంత్ దేవేందర్, గ్రామ సర్పంచ్ కొర్ని నర్సిములు,రైతులు తదితరులు పాల్గొన్నారు
