Wednesday, April 15, 2026
Homeకెరీర్ న్యూస్Results | ఏపీ ఇంటర్ ఫలితాలు..

Results | ఏపీ ఇంటర్ ఫలితాలు..

  • ఈసారి అత్యధిక ఉత్తీర్ణతా శాతం సాధించారు..
  • హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్..

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఫలితాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in/ ను సంప్రదించాలని సూచించారు. ఇంటర్ ఫస్టియర్‌లో 5,10,307 మంది, సెకండియర్‌లో 5,05,609 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత 12 సంవత్సరాల్లో ఎన్నడూలేని విధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించారని నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

కాగా, ఏపీ ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ జిల్లాలో 92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత గుంటూరులో 88 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 87 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇక అన్నమయ్య జిల్లాలో అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ జిల్లాలో కేవలం 62 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News