Thursday, May 7, 2026
Homeబిజినెస్IndiGo | సమ్మర్ ప్రత్యేక ఆఫర్లు..

IndiGo | సమ్మర్ ప్రత్యేక ఆఫర్లు..

  • 10 శాతం డిస్కౌంట్ ప్రకటించిన ఇండిగో..

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో..వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా సమ్మర్‌ సేల్‌ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘సమ్మర్‌ గేటవే’ సేల్‌ కింద దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై 10 శాతం వరకు డిస్కౌంట్‌ను కల్పిస్తున్నది.

ఈ నెల 17 వరకు బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు జూలై 1 నుంచి అక్టోబర్‌ 9 లోగా ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చునని సూచించింది. ఈ ఆఫర్లు కంపెనీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌, వాట్సప్‌ సర్వీసెస్‌(7065145858)లతో బుకింగ్‌ చేసుకోవచ్చును. వీటితోపాటు ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ సర్వీసులపై 70 శాతం రాయితీ ఇస్తున్న సంస్థ, బ్యాగేజ్‌పై 50 శాతం తగ్గింపుతో అందిస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News