- స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్..
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానేకు ఫైన్ పడింది. అతనికి 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్‌లో మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి ఫైన్ వేశారు. ఈ సీజన్‌లో కోల్‌కతా పర్ఫార్మెన్స్ మరీ దారుణంగా ఉంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 32 రన్స్ తేడాతో కోల్‌కతా ఓటమి పాలైంది.
టాటా ఐపీఎల్‌లో భాగంగా జరిగిన 22వ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రహానేకు ఫైన్ వేసినట్లు ఐపీఎల్ మీడియా అడ్వైజరీ ఓ ప్రకటనలో చెప్పింది. ఈ సీజన్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 కింద తొలిసారి నేరంగా పరిగణిస్తూ ఆ ఫైన్ వేసినట్లు చెప్పారు. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో తన తదుపరి మ్యాచ్ కోల్‌కతా ఆడనున్నది.
