HomeతెలంగాణSafety Concerns | ఇదేం గెస్ట్ హౌస్ సంస్కృతి..?

Safety Concerns | ఇదేం గెస్ట్ హౌస్ సంస్కృతి..?

  • దీనికి చరమగీతం పడాల్సిందే..
  • మిథునా యాడ్స్ అధినేత్రి కె. శోభారెడ్డి బాధితురాలు ఆవేదన..
  • ప్రభుత్వానికి పరీక్షగా మారిన గెస్ట్ హౌస్ వ్యవహారం..
  • సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంఘటన..!
  • మహిళలను లక్షాధికారులుగా చేస్తామని సీఎం ప్రతిజ్ఞ..
  • ఇప్పుడేమని సమాధానం చెబుతారు..?
  • తన సన్నిహితుడిపై వచ్చిన ఆరోపణలు ఎలా ఎదుర్కొంటారు..?
  • ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కాదు.. కనీస రక్షణ కావాలి..

మాది మహిళా పక్షపాత ప్రభుత్వం.. మహిళా సాధికారతకోసమే అహర్నిశలు శ్రమిస్తున్నాం.. రాబోవు రోజుల్లో మహిళలను లక్షాధికారులుగా చేయడమే లక్ష్యం.. వారికి ఉచిత బస్సు ప్రయాణంతో బాటు, విద్యుత్తు, సొంత ఇల్లు, వివిధ రంగాల్లో శిక్షణ, ఉపాధి కల్పిస్తున్నాం.. ఒక మహిళా నేత ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీఠ వేస్తున్నాం అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ ఊదరగొడుతోంది..

కానీ వాస్తవంలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయన్నది విశ్లేషకుల వాదన.. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన కాల్ రికార్డ్స్, బాధిత మహిళ చేసిన ఆరోపణలు హల్ చల్ అవు తున్నాయి.. ఒక మహిళా పారిశ్రామిక వేత్తకు ఎదురైన అవమానకర సంఘటన ఇప్పుడు సంచలనం సృషి ్టస్తోంది.. మరి రాష్ట్రంలో సామాన్య మహిళల పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది.. అసలేం జరిగింది..? ఓసారి చూద్దాం..

- Advertisement -

న్యాయబద్ధమైన యాడ్స్ కాంట్రాక్ట్/అవకాశం కోసం ఆశ్రయిస్తే సీఎం సన్నిహితుడుగా చెప్పుకునే వ్యక్తి ఓ మహిళా వ్యాపారవేత్తను గెస్ట్‌హౌస్‌కు రావాలని వేధించడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది..సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..Safety Concerns

ఈ వ్యవహారంపై బీఆరఎస్ జనరల్ సెక్రటరీ ఆరఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి దీనిపై స్పందించి ఆ మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.. అయితే ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటంటే ప్రభుత్వ కార్యాలయాలు ఉండగా, అనధికారిక గెస్ట్‌హౌస్ లో మీటింగ్‌లు ఎందుకు? అన్న ప్రశ్న తలెత్తుతోంది.. ప్రజాస్వామ్యంలో పారదర్శకత, సమాన అవకాశాలు అన్నవి ప్రాథమిక సూత్రాలు. ప్రభుత్వ యాడ్స్ లేదా కాంట్రాక్టులు నిబంధనల ప్రకారం టెండర్లు లేదా అధికారిక ఛానెళ్ల ద్వారా జరగాలి. కానీ, సీఎం సన్నిహితుడు పేరుతో గెస్ట్‌హౌస్‌లకు రమ్మనడం అధికార దుర్వినియోగానికి, మధ్యవర్తిత్వపు చీకటి కోణానికి నిదర్శనం.Safety Concerns

ఒక మహిళా వ్యాపారవేత్త గొంతు నొక్కుతున్న ఈ వాతావరణం, పారదర్శక పాలన అందిస్తున్నామనే ప్రభుత్వానికి అసలు సిసలు అగ్నిపరీక్ష కానుందా..? సచివాలయం లేదా సంబంధిత శాఖా కార్యాలయాల్లో చర్చించాల్సిన అంశాన్ని గెస్ట్‌హౌస్‌కు ఎందుకు పరిమితం చేయాలి? అయితే పరిపాలనలో సీఎం రేవంత్ పేరు చెప్పుకుని చక్రం తిప్పుతున్న ఆ సన్నిహితుడు ఎవరు? అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది.. ప్రభుత్వం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది..

కాగా శోభారెడ్డికి ఎదురైన ఈ అవమానకర సంఘటనపై ప్రభుత్వ పెద్దలు స్పందించి, తప్పు చేసిన వారిపై నిర్మొహమాటంగా వేటు వేస్తారా? లేక రాజకీయ మైలేజీ కోసం మౌనం వహిస్తారా? అన్నది కూడా చూడాలి.. అయితే ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ నైతిక అర్హత కోల్పోయారని, పేట్ బషీరాబాద్ పీఎస్ ముందు లొంగిపోవాలని బీ.ఆర్.ఎస్. నాయకులు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం అంటే మధ్యవర్తుల అడ్డా కాదు.. పౌరుల, ముఖ్యంగా ధైర్యంగా ముందుకు వచ్చిన మహిళా పారిశ్రామికవేత్తల ఆత్మగౌరవాన్ని కాపాడే రక్షణ కవచం కావాలి. జీఓ 68 అయినా, యాడ్ కాంట్రాక్ట్ అయినా.. పారదర్శకతే కొలమానం. మౌనం వీడి, నిజానిజాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చి బాధితురాలికి న్యాయం చేయడమే ప్రభుత్వ నిబద్ధతకు నిజమైన పరీక్ష! చూద్దాం ఏమి జరుగనుందో..?(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News