Homeవరంగల్‌Jathara | అమ్మవారిపేట శ్రీ సమ్మక్క -సారలమ్మ జాతర.

Jathara | అమ్మవారిపేట శ్రీ సమ్మక్క -సారలమ్మ జాతర.

  • సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు…

హన్మకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచిన అమ్మవారిపేట శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతరను భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో పాటు అత్యంత భద్రతతో నిర్వహించేందుకు వర్ధన్నపేట శాసనసభ్యులు, కే.ఆర్ నాగరాజు అధికార యంత్రాంగంతో కలిసి సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.

లక్షలాది మంది భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి.. వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశాలు. రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ప్రత్యేక ఆర్టీసీ బస్సుల నిర్వహణపై స్పష్టమైన సూచనలు. భక్తుల భద్రతే అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే; అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలకు ఆదేశం. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, జాతర నిర్వహణలో అన్ని శాఖలు పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలన్న సూచన. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు, కమిటీ సభ్యుల సమిష్టి కృషితో జాతరను ఘనంగా నిర్వహించాలన్న ఎమ్మెల్యే నాగరాజు.

- Advertisement -
MLA K R Nagaraju Reviews Ammavaripet Jathara Arrangements1 1

తొలుత శ్రీ సమ్మక్క -సారక్క అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు. అనంతరం జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే నాగరాజు, మేయర్ గుండు సుధారాణి ఆవిష్కరించారు. ఈ సమీక్ష సమావేశంలో నగర మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఆర్&బి శాఖ, ఆర్టీసీ శాఖ, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొని జాతర ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.

MLA K R Nagaraju Reviews Ammavaripet Jathara Arrangements2

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అమ్మవారి జాతర జరిగే ప్రదేశంలో కొంత భాగం ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిగా ఉన్నందున, ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి ఎక్కడైనా అందుబాటులో ఉంటే, రెవెన్యూ మంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి, జాతరకు అవసరమైన అదనపు భూమిని కేటాయించే విధంగా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని భరోసా ఇచ్చారు…

MLA K R Nagaraju Reviews Ammavaripet Jathara Arrangements3

సమీక్ష అనంతరం అమ్మవారిపేట జాతర కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతర కమిటీ సభ్యులకు కండువాలు కప్పి, సంప్రదాయాలను గౌరవిస్తూ, క్రమశిక్షణతో, భక్తుల సేవే లక్ష్యంగా పనిచేసి ఈ పవిత్ర జాతరను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు, జాతర కమిటీ సభ్యుల సమిష్టి కృషితోనే ఈ జాతర మరింత వైభవంగా జరుగుతుందని అన్నారు…

ఈ సమీక్ష సమావేశంలో స్థానిక కార్పొరేటర్ జలగం అనిత -రంజిత్ రావు, 43వ డివిజన్ కార్పొరేటర్ అరుణ -విక్టర్, జాతర కమిటీ చైర్మన్ పూడూరు బిక్షపతి, కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News