- హెచ్చరించిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ..Weather Alert
- అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు..
బంగాళాఖాతంలో మరో వాతావరణ మార్పు చోటుచేసుకోనుంది. సముద్రంలో కొత్తగా అల్పపీడనం పుంజుకునే సూచనలు కనిపిస్తున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనమే దీనికి కారణంగా నిలవనుంది. ఈ ఆవర్తన ప్రభావం వల్ల నవంబర్ 30 నాటికి అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతం పరిధిలో అల్పపీడనం రూపుదిద్దుకోనుంది. ఆ తర్వాత ఇది క్రమంగా మరింత శక్తిని పుంజుకోనుంది.Weather Alert
డిసెంబర్ 2 నాటికి ఇది వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశముంది. తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు ఇది వెళ్లొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే తీరం దాటకముందే సముద్రంలోనే ఇది శక్తిని కోల్పోయి బలహీనపడే సంకేతాలు కూడా ఉన్నాయని వాతావరణ విశ్లేషణల ద్వారా స్పష్టమవుతోంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
