HomeజాతీయంNetflix Pakistan Content Ban| నెట్ ఫ్లిక్స్ కి కేంద్రం వార్నింగ్..

Netflix Pakistan Content Ban| నెట్ ఫ్లిక్స్ కి కేంద్రం వార్నింగ్..

  • పాకిస్తాన్ చెందిన డిజిటల్ కంటెంట్ ప్రసారం చేయొద్దు..Netflix Pakistan Content Ban
  • షాక్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని హెచ్చరిక..

పాకిస్థాన్‌కు చెందిన ఎలాంటి డిజిటల్ కంటెంట్‌ను భారతదేశంలో ప్రసారం చేయవద్దని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ను కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ మరోసారి ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వం గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, భారతీయ వీక్షకులకు పాక్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని స్పష్టం చేసింది.Netflix Pakistan Content Ban

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ వెబ్ సిరీస్ ‘జో బచే హై సంగ్ సమేత్ లో’ డిసెంబర్‌లో భారత్‌లో విడుదల కానుందనే వార్తలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నెట్‌ఫ్లిక్స్‌కు ఈ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, స్ట్రీమింగ్ సర్వీసులు పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్‌ను ప్రసారం చేయరాదంటూ 2025 మే 8న ఇచ్చిన మార్గదర్శకాలను కేంద్రం గుర్తుచేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఏ సినిమా లేదా వెబ్ సిరీస్‌ను భారత్‌లోని సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంచబోమంటూ 2025 జూన్‌లో నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన లిఖితపూర్వక హామీకి కట్టుబడి ఉండాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News