Friday, June 12, 2026
Homeఅంతర్జాతీయంAmerica | ఊపిరి పీల్చుకున్న అమెరికా

America | ఊపిరి పీల్చుకున్న అమెరికా

43 రోజులుగా షట్‌డౌన్‌(Shut Down)తో తీవ్రంగా ఇబ్బందిపడ్డ అమెరికా.. ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. ప్రభుత్వ మూసివేతకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఫుల్‌స్టాప్ పెట్టారు. ఫండ్స్ బిల్లుపై మొన్న సంతకం (Sign) చేశారు. షట్‌డౌన్ ముగింపు బిల్లుకు 222-209 ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ప్రెసిడెంట్ (President) సంతకం చేయటంతో జనవరి 30వ తేదీ వరకు నిధుల కేటాయింపునకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

ప్రభుత్వం ఇప్పుడు సాధారణ కార్యకలాపాలను పున:ప్రారంభిస్తుంది. జీవన వ్యయాన్ని తగ్గించడానికి, భద్రతను తిరిగి నెలకొల్పటానికి పనిచేస్తామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. షట్‌డౌన్ వల్ల అక్టోబర్ నుంచి ఉద్యోగులకు వేతనాలు (Salaries) ఆగాయి. ఆహార సౌకర్యాలు నిలిచిపోయాయి. శాలరీ రాకపోవటంతో చాలా మంది ఉద్యోగులు డ్యూటీ(Duty)కి డుమ్మా కొట్టారు. విమానయానం తదితర రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News