అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు.
మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలన్నీ కూడా చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. తాజాగా ఈ మూవీ సోల్‌ని చెప్పే ఓ అందమైన గీతాన్ని వదిలారు. మిడిల్ క్లాస్ బతుకుల్ని అద్దం పట్టేలా ‘కాసుల కళ’ అంటూ సాగే ఈ పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటకు నిఖ్లేష్ సుంకోజి సాహిత్యం ఎంతో అర్థవంతంగా ఉంది. ఇక స్మరణ్ సాయి ఇచ్చిన బాణీ అయితే గుండెల్ని తాకేలా ఉంది. ఈ పాటలో ఏక్నాథ్ గాత్రం మరింత ఫీల్‌ను ఇస్తోంది.
పక్కా లోకల్ ఫ్లేవర్‌తో హైదరాబాద్‌లోని ఇంకో కోణాన్ని ఆవిష్కరించేలా ‘అమీర్ లోగ్’ ఉండబోతోంది. ఈ మూవీకి ఎస్వీకే కెమెరావర్క్, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్, స్మరణ్ సాయి మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఆగస్ట్ 21న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
*తారాగణం* : MC హరి, మనోజ్, శశిధర్ కొచ్చర్లకోట, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి తదితరులు
*సాంకేతిక సిబ్బంది:*
బ్యానర్: అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్
దర్శకుడు: రమణారెడ్డి సోమ
నిర్మాత: మాధవి రెడ్డి సోమ
సహ నిర్మాత: మనోహర్ రెడ్డి మంచురి
విడుదల: రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా
DOP: SVK
ఎడిటర్: రోహిత్ పెనుమత్స
సంగీతం: స్మరణ్ సాయి
పోస్టర్లు: శక్తి
సింక్ సౌండ్ & మిక్సింగ్: స్వప్నిక్ రావు
చీఫ్ AD: సాయి యోగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ బోరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: శరత్ పోలవరపు
PRO: సాయి సతీష్
