Thursday, May 28, 2026
HomeతెలంగాణNTR Statue | అమీర్ పేట్ లో ఎన్టీఆర్ విగ్రహం..

NTR Statue | అమీర్ పేట్ లో ఎన్టీఆర్ విగ్రహం..

  • ఎమ్మెల్యే నవీన్ చొరవతో నేడు స్థాపన..
  • మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..

తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు భారీ కాంస్య విగ్రహం హైదరాబాద్ నగర నడిబొడ్డున కొలువుదీరింది. అమీర్‌పేటలోని మైత్రీవనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన 23 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేడు (గురువారం) ఆవిష్కరించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఈ విగ్రహ ఏర్పాటులో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎన్టీఆర్ అభిమానుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ ఆయన ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆంధ్రప్రదేశ్‌ శిల్పి డి. రాజ్‌కుమార్ ఉడయార్ రెండు నెలల పాటు శ్రమించి ఈ కాంస్య విగ్రహానికి రూపమిచ్చారు. విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్వయంగా పర్యవేక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News