- హాస్పిటల్ కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించాలని ఎమ్మెల్సీ నెల్లికంటీ సత్యంకి మెమోరండం
కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్సీ.
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్(Government Hospital) లో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్(Sanitation Patient Care), సెక్యూరిటీ గార్డ్(Security Guard) కార్మికులకు గత నాలుగు నెలల నుంచి వేతనాలు రావడంలేదని ఈరోజు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకి(MLC Nellikanti Satyam) నల్లగొండ లో ఏఐటీయుసీ(AITUC) ఆధ్వర్యంలో మెమోరాండం(Memorandum) ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ సత్యం వెంటనే స్పందించి కలెక్టర్(Collector) తో ఫోన్లో మాట్లాడి వెంటనే జీతాలు ఇచ్చే ఏర్పాటు చేయమని కోరారు.ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేసే వాళ్ళంతా నిరుపేద కుటుంబాలకు చెందిన పేద కార్మికులనీ నాలుగు నెలలుగా వేతనాలు రాకపోతే వాళ్ళ కుటుంబం ఏ విధంగా గడుస్తుందని వారు అన్నారు. అధికారులు వెంటనే కార్మికుల వేతనాలు చెల్లించాలని కోరారు.
నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఈరోజు కార్మికుల విధులు బహిష్కరించి హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు నెలలుగా కార్మికుల వేతనాలు లేకున్నా విధులు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని కాంట్రాక్టర్ జీతాలు ఆపడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. కార్మికుల వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందుల గురిచేస్తున్న “ఏ వన్ ఏజెన్సీపై” చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
గత ఆరు నెలలుగా కార్మికులకు కాంట్రాక్టర్ పిఎఫ్ కూడా కట్టడం లేదని నేటికీ అకౌంట్ నెంబర్లు కూడా కార్మికులకు ఇవ్వలేదని ఆరోపించారు. కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం వరకు జీతాలు చెల్లించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని ఆయన పేర్కొకొన్నారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కాంటాక్ట్ వర్కర్స్ రవివర్మ, నాగబాబు, శివ, ప్రకాశ్,అనిత ధనమ్మ,వంశీ స్వాతి రేణుక, రవళి, శశికల, అజీమా, శోభ, అరుణ, శైలజ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
