Homeహైదరాబాద్‌Rath Yatra | రథయాత్ర బ్రోచర్ విడుదల చేసిన నిర్వాహకులు

Rath Yatra | రథయాత్ర బ్రోచర్ విడుదల చేసిన నిర్వాహకులు

  • ఎప్రిల్ 21నుండి ఆదిశంకరుల రథయాత్ర.

ఎప్రిల్ 21నుండి సింకింద్రాబాద్లోని తాడ్బన్ వీరాజనేయ స్వామి ఆలయం నుండి ఆధిశంకరుల రథయాత్ర ప్రారంభమవుతుందని వేధ బారతి వ్యవస్థాపకులు రేమెళ్ల అవధాని తెలిపారు. శ్రీ ఆదిశంకరాచార్యులు సనాతన ధర్మాన్ని నిర్వచించిన విధానం భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇటువంటి రథయాత్రలు నిర్వహిస్తున్నామన్నారు. ఆయన రచనలు నభూతో నభవిష్యత్ అన్న చందంగా ఉన్నాయని, వాటిని యువతకు అందించేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు.

Adi Shankara Rath Yatra Brochure Release Event

ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. హైందవులంతా ఐఖ్యంగా రథయాత్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో భారతీయం సత్యవాణి, నవీన్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, ప్రజ్ఞాభారతి, రవి శర్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News