Friday, November 14, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుNaveen Yadav | అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలి

Naveen Yadav | అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలి

ఓయూ ఏసీపీకి బీసీ నేత లింగం గౌడ్ విజ్ఞప్తి

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) తరఫున పోటీ చేస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యర్థి నవీన్ యాదవ్‌(Naveen Yadav)పై కొంత మంది పనిగట్టుకొని దుష్ప్రచారం (Bad Publicity) చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తప్పుపట్టారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) ఏసీపీ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా బీసీ బిడ్డకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక అతని వ్యక్తిగత ఇమేజ్‌ని దెబ్బతీస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలను పేపర్లలో రాసి రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం ఈ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ చైర్మన్ కొమ్మనబోయిన సైదులు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరబోయిన లింగయ్య యాదవ్, భారీ అశోక్, బుర శ్రీనివాస్, మామిడాల రవికుమార్, గోదా రవీందర్, చీరాల వంశీ, నూకల మధు, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News