- భక్తులకు త్రాగే నీటి కోసం తప్పని తిప్పలు
- కాళీ బాటిల్ తో వచ్చి ఖాళీగా వెళ్తున్న భక్తులు
- ఆలయ సిబ్బందిపై భక్తుల ఆగ్రహం
- పట్టించుకునే వారే లేరా
జగదేవపూర్: భక్తులకు తాగునీటి సమస్య(Drinking water problem) ఉండకూడదని ఏర్పాటుచేసి నెలలు గడవకుండానే గాలికి వదిలేసిన సంఘటన జగదేవపూర్ మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని(Kondapochamma temple) దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు త్రాగునీటి సమస్య ఉన్నదని తెలుసుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య(Beerla Ilaiah) భక్తులకు ఇకపై నీటి సమస్య ఉండకూడదని ఆగస్టు 26 న కొండపోచమ్మ ఆలయ ప్రాంగణంలో వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు .

ప్రారంభించి పట్టుమని పది రోజులు నడిపించారో లేదో కానీ ఎప్పుడూ చూసిన బిగించిన ట్యాబ్ ల నుండి నీరు రాకపోవడంతో ఆలయ అధికారులపై భక్తులు మండిపడుతున్నారు . అంతేకాకుండా వాటర్ ప్లాంట్ ను చూసి ఖాళీగా తెచ్చుకున్న బాటిళ్లు నింపుకుని దాహాన్ని తీర్చుకునే సమయానికి నీరు రాకపోవడంతో ప్లాంట్ నీ ఎదుకు ఏర్పాటు చేశారో అంటూ ఏమో ఖాళీ బాటిళ్లతో వచ్చి ఖాళీగా వెళుతూ ఆలయ సిబ్బందిపై మండిపడుతున్నారు భక్తులు. ఇప్పటికైనా ఆలయ అధికారులు చొరవ తీసుకొని గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఏమైనా చెడిపోతే చేయించి వచ్చే భక్తులకు దాహాన్ని తీర్చాలని కోరుతున్నారు.
