టెన్త్, ఐటీఐ పాసైనవాళ్లు అర్హులు
హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(NFC) వివిధ విభాగాల్లో 405 అప్రెంటిస్ (Apprentice) ఖాళీల భర్తీకి ప్రకటన (Notification) విడుదల చేసింది. ఫిట్టర్(Fitter), టర్నర్(Turner), ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, అటెండెంట్ ఆపరేటర్(కెమికల్ ప్లాంట్)(Chemical Plant), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మెన్(మెకానికల్), కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. నవంబర్ 15వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు NFC వెబ్‌సైట్ (www.nfc.gov.in) చూడొచ్చు.
