సమాచార హక్కు చట్టం వజ్రాయుధం.. పౌరుల చేతిలో పాశుపాతాస్త్రం.. చీకటి లోకంలో వెలుగు వెదుకుదాం, నిజం ఏమిటో తెల్సుకోడానికి అడుగులు వేద్దాం.. పాలనలో పారదర్శకత పెంపు.. ప్రతి పౌరునికి ఉంది ఓ హక్కు, సమాచార హక్కు! ప్రభుత్వం చేయునది మనకోసం కదా. అది ఎలా జరుగుతోందో తెలుసుకోవాల్సింది మనమే కదా.. పన్నులు చెల్లించేది మనమే, అందుకే సమాధానం అడిగే హక్కూ మనదే.. తప్పులు దాచే ప్రయత్నం చేస్తే, ప్రశ్నలతో వెలుగులోకి తెచ్చే శక్తి సమాచార హక్కే, ప్రశ్నించే ప్రతి గొంతుక ఒక ఆయుధం, సమాజం మార్చే శక్తి మనలో ఉంది..
కామిడి సతీష్ రెడ్డి
