- కార్తీకమాసంలో తప్పక దర్శించాల్సిన ఆలయం..Vemulawada Raja Rajeshwara Temple
- వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన గుడి..
కార్తీకమాసంలో శివాలయాల దర్శనానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ పవిత్ర మాసంలో తప్పక దర్శించాల్సిన తెలంగాణలోని ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర, అద్భుతమైన స్థలపురాణం, విశిష్టమైన ఆచారాలతో ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. భక్తులు ప్రేమగా ‘రాజన్న’ అని పిలుచుకునే స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో, కరీంనగర్‌కు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో వేములవాడ పట్టణంలో ఈ దివ్యక్షేత్రం కొలువై ఉంది. చారిత్రకంగా చాళుక్యుల కాలంతో సంబంధం కలిగిన ఈ ఆలయం పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది.Vemulawada Raja Rajeshwara Temple
భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో వేములవాడ క్షేత్ర ప్రాశస్త్యం ప్రస్తావించబడినట్లు చెబుతారు. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒకసారి పొరపాటున లేడిగా భావించి ఋషిని సంహరించాడట. ఈ పాపం నుంచి విముక్తి పొందేందుకు దేశాటన చేస్తూ వేములవాడకు చేరుకున్నాడు. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, నీటిని తాగడంతో అతడి పాపం తొలగిపోయిందని స్థలపురాణం వివరిస్తుంది. అనంతరం స్వామివారు కలలో కనిపించి, ధర్మగుండం సమీపంలో ఉన్న శివలింగాన్ని వెలికితీసి ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారట.Vemulawada Raja Rajeshwara Temple
స్వామివారి ఆజ్ఞ ప్రకారం నరేంద్రుడు ఆలయాన్ని నిర్మించి పూజలు ప్రారంభించినట్లు కథనం. గర్భాలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారు నీలలోహిత శివలింగ రూపంలో దర్శనమిస్తారు. స్వామివారికి కుడివైపున రాజేశ్వరి అమ్మవారు, ఎడమవైపున లక్ష్మీ సమేత గణపతి కొలువై ఉంటారు. ఆలయ ప్రాంగణంలో 22 శివలింగాలు ఉండటం విశేషం. కోదండ రామాలయం, కాశీ విశ్వేశ్వర ఆలయం, మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయం వంటి ఉపాలయాలు కూడా ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి, శ్రీ రామచంద్ర స్వామి ఆలయాలు ఉండటంతో ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రంగా పిలుస్తారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
