Homeవరంగల్‌Jyotirao Phule Death Anniversary | ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు..

Jyotirao Phule Death Anniversary | ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు..

  • ఈ సందర్భంగా ఘన నివాళులు…Jyotirao Phule Death Anniversary

మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు యాసం రమేష్ మాదిగ మాట్లాడుతూ…Jyotirao Phule Death Anniversary

సమాజంలో అంటరానితనం, కులవివక్ష, అసమానతలపై పోరాడి, సమానత్వ సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. స్త్రీ విద్యకు ప్రాధాన్యతనిస్తూ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని చాటి చెప్పిన మహనీయుడు ఆయన అని కొనియాడారు.Jyotirao Phule Death Anniversary
ఆయన ఆశయాలు, ఆలోచనలు, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అన్నారు.

- Advertisement -

సమానత్వం, విద్య, ఆత్మగౌరవం అనే ఆయన ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు అజరామరం… వారి సేవలు చిరస్మరణీయం అని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు యాసం మహేష్ మాదిగ, సీనియర్ నాయకులు వేల్పుల మల్లేష్ మాదిగ, కోకిల మల్లికార్జున మాదిగ, ఎం ఎస్ పి వెంకటాపురం మండల అధ్యక్షులు కొడారి సత్యం మాదిగ, ఎమ్మెస్ ఎఫ్ వెంకటాపురం మండల అధ్యక్షులు వేల్పుల శ్రీశాంత్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు చెన్నం తిరుపతి మాదిగ, చెన్నం గౌతం మాదిగ, వావిలాల ప్రసాద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News