HomeసినిమాUllipoola Seere Gatti Song | అంచనాలు పెంచేస్తున్న కొత్త సాంగ్..

Ullipoola Seere Gatti Song | అంచనాలు పెంచేస్తున్న కొత్త సాంగ్..

  • ఇడుపు కాయితం నుంచి ఉల్లిపూల సీరే గట్టి పాట రిలీజ్..Ullipoola Seere Gatti Song
  • అచ్చమైన తెలంగాణ కుటుంబ నేపథ్యంలో పాట..

నటుడు ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల సీరే గట్టి.. ఉత్తరాది సెరువే దాటి’ అంటూ సాగే పాట శనివారం విడుదలైంది. అచ్చమైన తెలంగాణ కుటుంబ నేపథ్యంతో, పల్లెదనపు పరిమళాలు అద్దుకుని వచ్చిన ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సంప్రదాయ భావోద్వేగాలతో సాగే ఈ గీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా అలరిస్తోంది.Ullipoola Seere Gatti Song

వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బన్నీ వాస్ వర్క్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబరు 11న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో తాజా పాటతో చిత్ర యూనిట్ ప్రచార జోరును మరింత పెంచింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News