- రెండో టెస్ట్ లోనూ తుది జట్టు నుంచి అవుట్..Mohammed Siraj
- క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సంఘటన..
భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను వరుసగా రెండో టెస్టులోనూ తుది జట్టు నుంచి పక్కన పెట్టడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగినప్పటికీ సిరాజ్‌కు చోటు దక్కలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రస్తుత సైకిల్‌లో 11 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు తీసి జట్టు తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న బౌలర్‌ను పక్కన పెట్టడంపై మాజీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Mohammed Siraj
ఈ నిర్ణయంపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందిస్తూ ఘాటు హెచ్చరికలు చేశారు. సిరాజ్ కెరీర్ ముగింపు అంత సులువుగా ఉండేలా కనిపించడం లేదని వ్యాఖ్యానించాడు. పేసర్ల ప్రాధాన్య క్రమంలో సిరాజ్ ఇప్పుడు నితీశ్ కుమార్ రెడ్డి కంటే వెనుకబడిపోయినట్లు సంకేతాలు వస్తున్నాయని పేర్కొన్నాడు. అత్యంత భావోద్వేగభరితమైన వ్యక్తిత్వం ఉన్న సిరాజ్ ప్రస్తుతం మానసికంగా తీవ్ర నిరాశలో ఉంటాడని, ఎవరైనా అతనితో మాట్లాడి దిశానిర్దేశం చేయాలని ఆకాంక్షించాడు. జట్టు యాజమాన్యం పాత ప్రదర్శనలను పక్కనపెట్టి ముందుకు సాగుతున్న తీరు జట్టులో తీవ్ర అనిశ్చితిని సృష్టిస్తోందని, తదుపరి అవకాశంలో 145 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీస్తే తప్ప అతడు పునరాగమనం చేయడం కష్టమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
