Homeనిజామాబాద్‌Madan Mohan | పేదలకు ఆపన్న హస్తంగా ఎమ్మెల్యే మదన్ మోహన్...!

Madan Mohan | పేదలకు ఆపన్న హస్తంగా ఎమ్మెల్యే మదన్ మోహన్…!

  • బాధిత కుటుంబానికి సత్వరమే ప్రభుత్వం నుండి రూ. 2.50 లక్షల ఆర్థిక చేయూతMadan Mohan
  • ఎమ్మెల్యేకు ఎప్పటికీ రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు…!

తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి గ్రామానికి చెందిన బాగనోల్ల ప్రశాంత్ అనే యువకుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో, శస్త్రచికిత్స చేయించుకునే స్తోమత లేక ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆపదలో ఉన్నవారికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వెంటనే స్పందించి అండగా నిలుస్తారని తెలుసుకున్న బాధిత కుటుంబం,తాడ్వాయి వర్కింగ్ ప్రెసిడెంట్ షౌకత్ అలీ, రాజీవ్,ల ద్వారా ఆయనను కలిసి తమ దీనస్థితిని వివరించారు.Madan Mohan

ప్రశాంత్ ఆరోగ్య పరిస్థితిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్, ఏమాత్రం కాలయాపన చేయకుండా మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం తరఫున రూ. 2,50,000 (రెండు లక్షల యాభై వేల రూపాయలు) విలువైన ఎల్‌ఓసీ (LOC) చెక్కును అందజేశారు.Madan Mohan

- Advertisement -

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమ కుమారుడికి శస్త్రచికిత్స అవసరమని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే స్పందించిన తీరు అమోఘమని కొనియాడారు. సకాలంలో ఆర్థిక సాయం అందించి తమ కుటుంబానికి కొండంత భరోసా ఇచ్చారని, ఆయన చేసిన మేలును జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమని కృతజ్ఞతలు తెలిపారు. ఆపద సమయంలో తమకు అండగా నిలిచి సహకరించిన తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు షౌకత్ అలీ, రాజీవ్‌లకు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News