- 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం…Blood Donation Camp
వెంకటాపురం మండలంలో కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 50 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి, ఆపదలో ఉన్న రోగుల ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు సహకారం అందించారు.Blood Donation Camp
ఈ కార్యక్రమంలో ఎదిర పీహెచ్‌సీకి చెందిన డాక్టర్ ఆశిష్ పాల్గొని రక్తదానం యొక్క ప్రాముఖ్యతను, రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. రక్తం అవసరమైన సమయంలో సకాలంలో రక్తం అందక ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాఫెడ్ సంస్థ డైరెక్టర్ బ్రదర్ కె. లూర్ధు రాజు మాట్లాడుతూ, “రక్తదానం అనేది కేవలం ఒక సామాజిక సేవ మాత్రమే కాదు, మరొకరికి జీవితాన్ని అందించే గొప్ప మానవతా కార్యక్రమం అన్నారు. మనం ఇచ్చే ఒక యూనిట్ రక్తం ఆపదలో ఉన్న ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉందని, కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా మానవత్వంతో ఒకరికొకరు సహాయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత సామాజిక బాధ్యతగా రక్తదాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. సుమారు 50 మంది ముందుకు వచ్చి రక్తదానం చేయడం ఎంతో అభినందనీయం అని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల్లో ఆరోగ్యంపై, రక్తదానంపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలను కాఫెడ్ సంస్థ కొనసాగిస్తుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల తహసీల్దార్ వేణుగోపాల్, మండల హెచ్ ఈ ఓ కోటిరెడ్డి, రెడ్‌క్రాస్ సిబ్బంది, టెక్నికల్ సూపర్‌వైజర్ ఆదినారాయణ, సుమంత్, అనంత్ రామ్, శృతి, ప్రసన్న, చేయూత ఫౌండేషన్ సభ్యులు, అయ్యప్ప టీమ్ సభ్యుడు విజయ్ సూర్య పాల్గొన్నారు.Blood Donation Camp
కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ బ్రదర్ కె. లూర్ధు రాజు, వెంకటాపురం మండల కోఆర్డినేటర్ జి. హనుమంత్, వాజేడు మండల కోఆర్డినేటర్ జి. కామేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాఫెడ్ యానిమేటర్లు నరేష్, ప్రశాంత్, పద్మ, ఉష, ప్రసాద్, స్వరూప, దీపారాణితో పాటు కాఫెడ్ సిబ్బంది కృష, కిషోర్, సుజల తదితరులు పాల్గొని శిబిరం విజయవంతం కావడానికి కృషి చేశారు.
సామాజిక బాధ్యతలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన కాఫెడ్ సంస్థను పలువురు అభినందించారు. ప్రజల్లో రక్తదానంపై అవగాహన పెంపొందించడం, స్వచ్ఛంద రక్తదాతలను ప్రోత్సహించడం, అవసరమైన వారికి సకాలంలో రక్తం అందేలా సహకరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
