- నాణ్యతలో రాజీ వద్దు.. పనులు త్వరితగతిన పూర్తి చేయాలి…Culvert Repair Inspection
- అధికారులకు మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ ఆదేశాలు..
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా మున్సిపల్ పాలకవర్గం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మంజీరా పైప్లైన్ రోడ్డులో చేపడుతున్న కల్వర్టు మరమ్మతు పనులను మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కల్వర్టు మరమ్మతు పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, నిర్మాణంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని అధికారులకు సూచించారు.Culvert Repair Inspection
నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ముఖ్యంగా రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, మరమ్మతు పనుల విషయంలో మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఈ సందర్భంగా చైర్మన్ పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతే ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలని, ప్రజాధనం వృథా కాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ.యోగేష్ కుమార్, డీఈ జగదీష్, కౌన్సిలర్లు గణేష్, సమ్మి, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రమౌళి, కో-ఆప్షన్ సభ్యుడు మహమూద్, మైనారిటీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)Culvert Repair Inspection
