- కఠిన నిబంధనలు తీసుకువచ్చిన కేంద్రం..Driving License Rules
- ఇప్పుడు టర్నర్ లైసెన్స్ టెస్టులో 75 శాతం మార్కులు రావాలి..
డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఇక ప్రక్రియ కఠినతరం కానుంది. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉండేది. ముందుగా లెర్నింగ్ లైసెన్స్ పరీక్ష రాసి, ఆ తర్వాత ఆరు నెలల్లోపు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. డ్రైవింగ్ టెస్ట్‌లో అర్హత సాధిస్తే 10 రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ పోస్ట్ ద్వారా రవాణాశాఖ ఇంటికి పంపించేంది. కానీ ఇక నుంచి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు కేంద్ర మోటారు వాహన నిబంధనలకు ప్రధాన సవరణల ముసాయిదాను కేంద్రం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా లెర్నింగ్ లైసెన్స్ పరీక్షను మరింత కఠినతరం చేస్తున్నారు.Driving License Rules
గతంలో లెర్నర్ లైసెన్స్ పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు 60 శాతంగా ఉండేది. కానీ ఇప్పుడు కనీసం 75 శాతం మార్కులు అవసరమయ్యేలా కొత్త నిబంధన తీసుకొస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందే ముందు దరఖాస్తుదారులకు రహదారి చిహ్నాలు, ట్రాఫిక్ నియమాలు, సురక్షిత డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన ఉండేలా చూసేందుకు ఉత్తీర్ణత మార్కులను పెంచారు. సురక్షిత డ్రైవింగ్‌పై ఆన్లైన్ ట్యుటోరియల్ కనీసం 30 నిమిషాల నిడివి ఉండేలా మార్పులు చేయనున్నారు. ఇది పూర్తి చేసేందుకు గతంలో నిర్ణయించిన ఏడు రోజుల సమయాన్ని 15 రోజులకు పెంచనున్నారు. ట్యుటోరియల్ పూర్తి చేసిన తర్వాత నిర్దేశించిన కాలపరిమితిలోపు లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
