HomeజాతీయంIndia US Trade Agreement | భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పొందం..

India US Trade Agreement | భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పొందం..

  • వివరాలు తెలిపిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్..India US Trade Agreement
  • ఇన్నాళ్లూ ఎదురైనా అడ్డంకులు తొలిగిపోయాయని వ్యాఖ్య..

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఒప్పంద విధివిధానాలు, అమలు ప్రక్రియలో ఇన్నాళ్లూ ఎదురైన అడ్డంకులు తొలగిపోతున్నాయని చెప్పారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ‘ఇండియా డెట్ క్యాపిటల్ మార్కెట్ సమ్మిట్ 2026’ సదస్సులో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.India US Trade Agreement
ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం అతి త్వరలోనే ఒక కొలిక్కి రానుందని గోయల్ స్పష్టం చేశారు. చర్చల్లో కీలకమైన ముందడుగు పడిందని తెలిపారు. ఇరు దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం సిద్ధమవుతోందని వివరించారు.

భారత ఆర్థిక ప్రగతిని గోయల్‌ కొనియాడారు. జీఎస్టీ వ్యవస్థను సులభతరం చేస్తూనే పన్ను రేట్లను అందుబాటులో ఉంచామని గుర్తుచేశారు. ఇటీవల జీఎస్టీ వసూళ్లు ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేశాయని చెప్పారు. ఒకే నెలలో ఎగుమతులు 90 బిలియన్ డాలర్లకు చేరడం దేశ చరిత్రలోనే ఓ మైలురాయి అని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్‌తో కూడా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముగింపునకు వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి యూరోపియన్ యూనియన్ ఒప్పందం ఖరారవుతుందని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి అది అమల్లోకి వచ్చే అవకాశముందని అంచనా వేశారు. ఈ ఒప్పందాల ద్వారా భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అవకాశాలు దక్కుతాయని ధీమా వ్యక్తం చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News