Homeనిజామాబాద్‌Kaundinya Maharshi Jayanti | ఘనంగా కౌండిన్య మహర్షి జయంతి వేడుకలు

Kaundinya Maharshi Jayanti | ఘనంగా కౌండిన్య మహర్షి జయంతి వేడుకలు

  • కార్తీక పౌర్ణమి రోజున గౌడ కుల మూలపురుషుడి జయంతి వేడుకలు నిర్వహించిన గౌడ సోదరులుKaundinya Maharshi Jayanti
  • గౌడ కుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు కౌండిన్య మహర్షి ఆదర్శం: జై గౌడ ఉద్యమ నాయకులు

తాడ్వాయి: గౌడ కులస్తుల ఆరాధ్య దైవం, గౌడ వంశ మూలపురుషుడిగా భావించే శ్రీశ్రీశ్రీ కౌండిన్య మహర్షి జయంతి వేడుకలను మంగళవారం హైదరాబాద్‌లోని కంఠమహేశ్వర ఆలయంలో గౌడ సోదరులు భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకలకు కామారెడ్డి జిల్లా నుంచి జై గౌడ ఉద్యమ నాయకులు, గౌడ కులస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కౌండిన్య మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.Kaundinya Maharshi Jayanti

అనంతరం కామారెడ్డి జిల్లా జై గౌడ ఉద్యమ అధ్యక్షుడు రంగోల మురళి గౌడ్ మాట్లాడుతూ.. గౌడ వంశ మూలపురుషుడైన శ్రీశ్రీశ్రీ కౌండిన్య మహర్షి కార్తీక పౌర్ణమి పర్వదినాన జన్మించడం గౌడ కులస్తులందరికీ ఎంతో గర్వకారణమన్నారు. కౌండిన్య మహర్షి కేవలం ఒక మహర్షి మాత్రమే కాకుండా గౌడ సమాజానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా మార్గదర్శకుడని కొనియాడారు. తరతరాలుగా గౌడ కులస్తులు ఆయనను తమ మూలపురుషుడిగా, ఆరాధ్య దైవంగా భావిస్తూ పూజిస్తున్నారని తెలిపారు.

- Advertisement -

గౌడ కుల సంప్రదాయాలు, కులవృత్తి, ఆచార వ్యవహారాలతో కౌండిన్య మహర్షికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. గౌడ కులస్తుల ప్రధాన జీవనాధారమైన తాటి, ఈత చెట్లపై ఆధారపడిన వృత్తికి సంబంధించిన పరిజ్ఞానం, సంప్రదాయాలను తరతరాలకు అందించడంలో ఆయన పేరు గౌడ సమాజంలో విశేష ప్రాధాన్యతను సంపాదించుకుందని పేర్కొన్నారు. ప్రకృతితో మమేకమై, చెట్లను ఆధారంగా చేసుకొని జీవనోపాధి పొందే వృత్తికి గౌరవం కల్పించడమే కాకుండా శ్రమను నమ్ముకొని స్వయంకృషితో జీవించే గొప్ప జీవన విధానానికి ఆయన సంప్రదాయం ప్రతీకగా నిలుస్తోందన్నారు.

కౌండిన్య మహర్షి చూపిన మార్గం గౌడ కులస్తులకు కేవలం జీవనోపాధి మార్గమే కాకుండా ఆత్మగౌరవం, కష్టపడే తత్వం, ఐక్యత, సంప్రదాయ పరిరక్షణకు ప్రతీకగా నిలిచిందని వివరించారు. గౌడ కులస్తుల ఆచారాలు, సంస్కృతి, వృత్తి నైపుణ్యాలు, సామాజిక గుర్తింపును భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కులవృత్తిని గౌరవిస్తూ, ఆధునిక కాలానికి అనుగుణంగా విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా గౌడ యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా ప్రతి కులానికి వివిధ గోత్రాలు ఉన్నప్పటికీ, గౌడ కులస్తులందరికీ కౌండిన్య గోత్రమే ప్రధాన గుర్తింపుగా కొనసాగుతోందని ఆయన గుర్తుచేశారు. కౌండిన్య మహర్షి జయంతి వేడుకలు కేవలం పండుగలకే పరిమితం కాకుండా గౌడ కుల ఐక్యతను చాటే వేదికలుగా నిలవాలని ఆకాంక్షించారు. మహర్షి ఆశయాలను, గౌడ సమాజ చరిత్రను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు కులస్తులంతా ఐక్యంగా ఉండి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.Kaundinya Maharshi Jayanti

ఈ కార్యక్రమంలో జై గౌడ జాతీయ అధ్యక్షుడు వట్టి రామారావు గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ్, కామారెడ్డి జిల్లా జై గౌడ ఉద్యమ ఉపాధ్యక్షుడు శేఖర్ గౌడ్, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు నర్సా గౌడ్‌తో పాటు పలువురు జై గౌడ ఉద్యమ నాయకులు, గౌడ సంఘం ప్రతినిధులు, గౌడ సోదరులు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News