HomeజాతీయంIndia Third Most Powerful Nation | మూడో శక్తివంతమైన దేశం భారత్..

India Third Most Powerful Nation | మూడో శక్తివంతమైన దేశం భారత్..

  • మోడీ ప్రభావవవంతమైన నాయకత్వం..India Third Most Powerful Nation
  • లోవీ ఇనిస్టిట్యూట్, ఆసియా పవర్ ఇండెక్స్ లో వెల్లడి..

ఆసియా ఖండంలో భారత్ తన ప్రాబల్యాన్ని మరింత విస్తరిస్తూ మూడో అత్యంత శక్తిమంతమైన దేశంగా తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభావవంతమైన నాయకత్వం, బలమైన ఆర్థిక అంచనాలు, వ్యూహాత్మక దౌత్య సంబంధాల అండతో భారత్ ఈ ఘనత సాధించిందని ప్రముఖ అంతర్జాతీయ థింక్ ట్యాంక్ ‘లోవీ ఇన్‌స్టిట్యూట్’ తాజా ‘ఆసియా పవర్ ఇండెక్స్’ నివేదికలో వెల్లడించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తర్వాత ఆసియాలోనే రెండో అత్యంత ప్రభావవంతమైన ప్రాంతీయ నాయకుడిగా మోదీ నిలిచారని ఈ నివేదిక స్పష్టం చేసింది.India Third Most Powerful Nation

లోవీ ఇన్‌స్టిట్యూట్ ప్రాజెక్ట్ లీడ్ డాక్టర్ హంటర్ మార్స్‌టన్‌ వివరాల ప్రకారం.. భారత్ తన స్కోరును 40.5 పాయింట్లకు పెంచుకొని ప్రధాన శక్తిగా స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2018లో ఈ ఇండెక్స్ ప్రారంభమైన నాటి నుంచి పరిశీలిస్తే, చైనాతో ఉన్న అంతరాన్ని భారత్ అత్యంత కనిష్ఠ స్థాయికి తగ్గించగలిగింది. అయినప్పటికీ చైనా శక్తి ఇప్పటికీ భారత్ కంటే 80 శాతం అధికంగానే ఉంది. మొత్తం ఎనిమిది కీలక విభాగాల్లో పరిశీలించగా.. ఐదింటిలో భారత్ మంచి వృద్ధిని నమోదు చేసింది. ఆగ్నేయాసియా దేశాలతో రక్షణ సంబంధాలు బలపడటం, బ్రహ్మోస్ క్షిపణుల విక్రయాలతో భారత్ రక్షణ నెట్‌వర్క్ విభాగంలో 9వ స్థానానికి చేరుకుంది. భారత సాంస్కృతిక ప్రభావం సైతం 43.8 పాయింట్లకు పెరిగింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News