బస్టాండ్ ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ పర్మిట్ రూమ్ నిర్వహణ…Complaint
ఆధారాలతో ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చర్యలు తీసుకోవాలని వినతి…
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న మణికంఠ వైన్స్, పర్మిట్ రూమ్ నిర్వహణపై ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు (Complaint) అందింది. నిబంధనలకు విరుద్ధంగా వైన్స్‌తో పాటు పర్మిట్ రూమ్ నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని కోరుట్లకు చెందిన ఒక వ్యక్తి ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.
ఈ నెల 13వ తేదీన ఫిర్యాదు చేసినప్పటికీ, ఈ నెల 16వ తేదీ సోమవారం సాయంత్రం వరకు కూడా వైన్స్, పర్మిట్ రూమ్ నిర్వహణలో ఎలాంటి మార్పు కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమతులకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారానికి సంబంధించి వీడియో దృశ్యాలు, ఇతర ఆధారాలను కూడా అధికారులకు అందించినట్లు లేఖలో తెలిపారు. సంబంధిత వైన్స్, పర్మిట్ రూమ్‌పై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను కోరారు.
ఫిర్యాదు చేసినా చర్యలు ఎప్పుడు?
బహిరంగంగా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించి తనిఖీలు చేపడతారా? నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ జరుగుతుంటే చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
