Homeకరీంనగర్BJP | నాడు పదవి.. నేడు తిరస్కారం..!

BJP | నాడు పదవి.. నేడు తిరస్కారం..!

బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బత్తుల శ్రీనివాస్‌కు గుర్తింపు.. ఇప్పుడు అదే పదవి తొలగింపు..BJP

కోరుట్ల బీజేపీలో వర్గపోరుతో కార్యకర్తలు బలవుతున్నారా…?

- Advertisement -

పార్టీలో అంతర్గత విభేదాలపై రాజకీయ వర్గాల్లో చర్చ..!

జగిత్యాల జిల్లా కోరుట్ల భారతీయ జనతా పార్టీలో (BJP) అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయా..? పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు పదవుల విషయంలో ఒకసారి గుర్తింపు ఇచ్చి, మరోసారి తిరస్కరించడం వెనుక కారణాలేమిటనే ప్రశ్నలు స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అంశం

బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బత్తుల శ్రీనివాస్‌కు గతంలో పదవి కల్పించి గుర్తింపు ఇచ్చిన పార్టీ నాయకత్వం, ప్రస్తుతం అదే పదవి విషయంలో భిన్నంగా వ్యవహరిస్తోందనే చర్చ జరుగుతోంది. నాడు పదవితో గౌరవించిన నాయకత్వం.. నేడు ఎందుకు తిరస్కరిస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కోరుట్ల బీజేపీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాల ప్రభావం పార్టీ కార్యకర్తలపై పడుతోందా..? నాయకుల మధ్య ఆధిపత్య పోరులో కష్టపడి పనిచేసే కార్యకర్తలు నష్టపోతున్నారా…? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీ బలోపేతం కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఇవ్వాల్సిన నాయకత్వం, అంతర్గత విభేదాలకు తావులేకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

అసలు బత్తుల శ్రీనివాస్‌కు గతంలో ఇచ్చిన పదవిని ప్రస్తుతం ఎందుకు తిరస్కరించారు..? దీని వెనుక ఉన్న కారణాలేమిటి..? కోరుట్ల బీజేపీలో వర్గపోరు నిజంగానే కొనసాగుతోందా..? అన్న ప్రశ్నలకు పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube) 

- Advertisement -
RELATED ARTICLES

Latest News