Homeకరీంనగర్Land Encroachments | కోరుట్లలో అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యమేనా?

Land Encroachments | కోరుట్లలో అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యమేనా?

  • కాలువలు, హద్దులు, రహదారుల ఆక్రమణలతో యథేచ్ఛగా ప్లాట్ల విక్రయాలు!Land Encroachments
  • మున్సిపల్, రెవెన్యూ అధికారుల తీరుపై పట్టణ ప్రజల ఆగ్రహం
  • అక్రమ కట్టడాలు, భూ ఆక్రమణలపై చర్యలు ఎప్పుడు….?

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో (Land Encroachments) ప్రభుత్వ భూములు, కాలువలు,హద్ది రాస్తాలు , ప్రజల రాకపోకలకు ఉపయోగపడాల్సిన రహదారుల ఆక్రమణలపై పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు అందజేసినా క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించడం లేదని, అధికారులకు దరఖాస్తులు ఇవ్వడం వృథా ప్రయాసగా మారిందని పలువురు పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాలువలు, రహదారుల స్థలాలు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలుLand Encroachments

- Advertisement -

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయి బాబా వెనుకాల సుమారు 6 ఫిట్ల వెడల్పు గల కాలువను అలాగే కోరుట్ల అంబేద్కర్ నగర్ వాగు నుండి గుమ్లాపూర్ హద్ది రాస్తాను కొందరు కబ్జా చేసి ఇల్లు నిర్మాణం చేపడితే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కొలిచి ఆ నిర్మాణాని కూల్చివేశారు. ఇటీవల కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అదే స్థలములో ప్లాట్లు పెట్టి అమ్ముతున్నారు. అన్ని ఇటు మున్సిపల్ అధికారులకు, అటు రేవన్యూ డివిజన్ అధికారికి పిర్యాదు చేసి పది హెడు రోజులు అవుతున్న పట్టించుకోకపోవడం పై పట్టణ ప్రజలు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు అలాగే పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో కాలువలు, రహదారులను ఆక్రమించి స్థలాలను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు ఉపయోగపడాల్సిన మౌలిక సదుపాయాల స్థలాలు ఆక్రమణలకు గురైతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో కాలువలు ఆక్రమణలకు గురైతే మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి, పరిసర ప్రాంతాలు నీటమునిగే పరిస్థితులు తలెత్తవచ్చని ప్రజలు అనుకుంటున్నారు.

Korutla Land Encroachments

అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువు….?Land Encroachments

మున్సిపల్, రెవెన్యూ శాఖల పరిధిలోకి వచ్చే ఈ సమస్యలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన స్పందన లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆక్రమణలు జరుగుతున్నాయనే సమాచారం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, రహదారుల హద్దుల గుర్తింపు, కాలువల స్థలాల సంరక్షణ వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది..

ప్లాట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి…?

కాలువలు, రహదారులు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన భూములను ప్లాట్లుగా చూపించి విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసే ముందు సంబంధిత భూమి హక్కులు, సర్వే నంబర్లు, ప్రభుత్వ రికార్డులు, అనుమతులు, లేఅవుట్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని కోరుతున్నారు.

కలెక్టర్ జోక్యం చేసుకోవాలని పట్టణ ప్రజల విజ్ఞప్తి..

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కాలువలు, హద్ది రాస్తాలా ఆక్రమణ జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న భూ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములు, కాలువలు, రహదారుల హద్దులను గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆక్రమణలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకొని ప్రజా ఆస్తులను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా…? లేక ప్రజల ఫిర్యాదులు కార్యాలయాలకే పరిమితం అవుతాయా…? అన్నది వేచించూడాలి…?(https://epaper.aadabhyderabad.in/)(Youtube) 

- Advertisement -
RELATED ARTICLES

Latest News