- అవినీతిని ప్రశ్నిస్తే దాడులా..? ఎమ్మెల్యే సంజయ్‌పై జువ్వాడి నర్సింగరావు ఘాటు విమర్శలుJuvvadi Narsinga Rao
- వీకెండ్ ఎమ్మెల్యే సంజయ్.. జాక్‌పాట్, ఫోన్ ట్యాపింగ్‌తో గెలిచారు
మెట్‌పల్లి పట్టణంలోని జువ్వాడి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు (Juvvadi Narsinga Rao) ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కోరుట్ల నియోజకవర్గంలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ అవినీతిని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. రాజకీయ అనుభవం లేని సంజయ్ మాట్లాడుతున్న తీరు విడ్డూరంగా ఉందని విమర్శించారు.
పరాన్నజీవి అనే పదానికి ఎమ్మెల్యేకు అర్థం తెలుసా అని ప్రశ్నిస్తూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో 70 శాతం మంది పరాన్నజీవులేనని వ్యాఖ్యానించారు. జాక్‌పాట్, ఫోన్ ట్యాపింగ్‌తో గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు తగిన తీర్పు ఇచ్చారని అన్నారు.
వారాంతంలో మాత్రమే నియోజకవర్గానికి వచ్చే ఎమ్మెల్యే సంజయ్‌ను వీకెండ్ ఎమ్మెల్యేగా అభివర్ణించారు. మీడియాలో ప్రచారం పొందేందుకు విలేకరుల సమావేశాలు నిర్వహించడం తప్ప ప్రజలకు చేసేదేమీ లేదని విమర్శించారు. మెట్‌పల్లి క్లబ్‌ను అమ్ముకున్న ఘనత కూడా ఎమ్మెల్యేకే దక్కుతుందని ఆరోపించారు.
కిరాయికి తెచ్చుకున్న వ్యక్తులతో దాడులు చేయిస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్న వారికే అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో సస్పెండ్ అయిన ఎమ్మెల్యే మీ తండ్రి కాదా అంటూ ప్రశ్నించారు.
ఆవేశంతో కాకుండా ఆలోచనతో ప్రజలకు సేవ చేయాలని ఎమ్మెల్యే సంజయ్‌కు జువ్వాడి నర్సింగరావు హితవు పలికారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
