- వన్డే టీమ్ లో చోటు దక్కుతుందా అన్నది మీమాంశ..Rohit Sharma
- న్యూజిలాండ్ వన్డే ఇన్నింగ్స్ లో 30 పరుగులే చేయడం గమనార్హం..
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) భవిష్యత్తుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో అతడికి చోటు దక్కుతుందా? అన్న ప్రశ్నకు కొత్త చీఫ్ సెలక్టర్ ప్రజ్ఞాన్ ఓజా సమాధానం చెప్పాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ కేవలం 30 పరుగులే చేయడం ఈ చర్చకు కారణమైంది. ఫామ్ కోల్పోయినప్పటికీ ఆట కొనసాగించాలన్న అతడి పట్టుదల.. సెలక్టర్లకు చిక్కుముడిగా మారింది.
జూనియర్ క్రికెట్ రోజుల నుంచి రోహిత్, ఓజా మధ్య స్నేహం ఉంది. గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీలో జరిగిన శిక్షణ శిబిరాల సమయంలోనూ వారి అనుబంధం బలపడింది. ఇప్పుడు ఓజా సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో రోహిత్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యక్తిగత అనుబంధాన్ని పక్కనపెట్టి, ఆటగాడి ప్రస్తుత సామర్థ్యం, ప్రపంచకప్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు అప్పటి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సూచనతో ఓజా.. రోహిత్‌తో సమావేశమయ్యాడు. లార్డ్స్‌లో జరిగే మ్యాచ్ సందర్భంగా వన్డేలకు వీడ్కోలు పలికేందుకు సిద్ధంగా ఉన్నాడా? అన్నది తెలుసుకోవడమే ఆ భేటీ ఉద్దేశం. అయితే ఆ ప్రతిపాదనపై రోహిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత క్రికెట్‌ను నడిపిస్తున్న వారిపై తన అసహనాన్ని కూడా వెల్లడించాడు. ఆ పరిణామాల తర్వాత అగార్కర్-రోహిత్ మధ్య వ్యక్తిగత సంబంధాలు దెబ్బతిన్నాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అగార్కర్ స్థానంలో వచ్చిన ఓజాకు ఆ బాధ్యత బదిలీ అయింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
