మొబైల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు (Electric shock) గురై ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎర్రగొర్ల ఉపేంద్ర (44) తన ఇంట్లో మొబైల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ప్లగ్ బాక్స్ వద్ద ఇన్సులేషన్ దెబ్బతిని విద్యుత్ వైర్లు బయటకు కనిపిస్తున్న విషయాన్ని ఆమె గమనించలేదు. ఛార్జర్‌ను ప్లగ్‌లో అమర్చే క్రమంలో తెగి ఉన్న వైర్లు చేతికి తగలడంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉపేంద్ర ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
