- పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు.. SSC
- నూతన షెడ్యూల్ విడుదల.. SSC
తెలంగాణలో పదో తరగతి ( SSC) పబ్లిక్ పరీక్షలు రాయబోయే విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ, సవరించిన నూతన షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. ఫీజు చెల్లింపు ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది.
సవరించిన షెడ్యూల్ ప్రకారం.. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 26 వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. ఆ గడువు ముగిసిన తర్వాత రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 8 వరకు అవకాశం కల్పించారు. రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 21 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 23 నుంచి జనవరి 4 వరకు ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు.
రెగ్యులర్ విద్యార్థులు మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు రాసేందుకు రూ.125 ఫీజుగా నిర్ణయించారు. మూడు సబ్జెక్టుల వరకు మాత్రమే రాసేవారు రూ.110 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ కోర్సు విద్యార్థులు రెగ్యులర్ ఫీజుకు అదనంగా మరో రూ.60 చెల్లించాలి. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు పరీక్ష ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
