Homeనల్లగొండTSUTF | పీఆర్సీ అమలులో జాప్యం వద్దు

TSUTF | పీఆర్సీ అమలులో జాప్యం వద్దు

  • జీవో 25ను తక్షణమే రద్దు చేయాలి…TSUTF
  • ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి…TSUTF
  • టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి.

తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పీఆర్సీని (TSUTF) ఎలాంటి జాప్యం లేకుండా 2023 జూలై నుంచి తక్షణమే అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారిన జీవో నంబర్ 25ను వెంటనే రద్దు చేయాలని కోరారు.టీఎస్‌యూటీఎఫ్ ఆరవ జిల్లా మహాసభల్లో చివరి రోజు భాగంగా ఆదివారం హుజూర్‌నగర్ పట్టణంలోని టౌన్‌హాల్‌లో జిల్లా అధ్యక్షుడు ఎన్. సోమయ్య అధ్యక్షతన రెండో రోజు ప్రతినిధుల సభ నిర్వహించారు.

ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన చావా రవి మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలల మూసివేత, విలీనం, ఏకోపాధ్యాయ పాఠశాలల ఏర్పాటు నిర్ణయాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను,50 మందికి పైగా విద్యార్థులున్న పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని అదే విధంగా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని సూచించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రతినిధుల సభ ప్రభుత్వాన్ని కోరింది. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, ఉపాధ్యాయుల ఆర్థిక, సర్వీస్ సమస్యలను పరిష్కరించాలని, విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని తీర్మానించారు.

- Advertisement -

ముఖ్యంగా విద్యాశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధికారుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.జిల్లాలోని 25 మండల శాఖల ప్రతినిధులు ఈ సభలో పాల్గొని విద్యారంగ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు.ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు సీహెచ్ రాములు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జే.యాకయ్య,జిల్లా కోశాధికారి జి. వెంకటయ్య,జిల్లా కార్యదర్శులు ఆర్. దామోదర్,ఎన్. నాగేశ్వరరావు,జే.కమల, వి. రమేష్,బి.ఆడం,సీహెచ్ రమేష్,డి. లాలు,కే. పాండురంగాచారి,కే. జ్యోతి, ఎన్. సాంబయ్య,డి.శ్రీనివాసాచారి,సీహెచ్ గోవింద్, హుజూర్‌నగర్, మఠంపల్లి మండలాల ఉపాధ్యాయ నాయకులు,ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News