- గుర్రం వెంకటేశ్వరరావు16వ వర్ధంతి సభలో సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్…
- పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాడిన గుర్రం వెంకటేశ్వర్లు ఆశయాలను కొనసాగించడo, ప్రజా సమస్యలపై పోరాటాల నిర్వహించి

కార్మిక, పేదల పక్షాన పోరాటాలు నిర్వహించడమే జీవికిచ్చే ఘనమైన నివాళి అని సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం కేంద్రంలో కామ్రేడ్ గుర్రం వెంకటేశ్వర్లు 16వ వర్ధంతి (Gurram Venkateswarlu) సభ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడారు. కామ్రేడ్ గుర్రం వెంకటేశ్వర్లు మరణం పార్టీకి తీరని లోటు అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లా నల్లమడుగు నుంచి వ్యాపార నిమిత్తం వెంకటాపురం వచ్చాడన్నారు. వెంకటాపురంలో సిపిఐ ఏం పార్టీ చేస్తున్న పోరాటాలకు ఆకర్షితుడయ్యాడన్నారు. తన నాయకత్వంలో పలు ప్రజా పోరాటాలు ముందుండి నడిపించిన వ్యక్తి గుర్రం అన్నారు. పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా కొనసాగాలంటే తన వ్యాపారాలను పక్కన పెట్టాలని పార్టీ ఆదేశిస్తే పార్టీ ఆదేశాల ప్రకారం తన వ్యాపారాలను విడిచిపెట్టి ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి జీవి అన్నారు.
డివైఎఫ్ఐ నాయకుడు నుండి మండల కార్యదర్శిగా పేదల పక్షాన, వారి సమస్యలపై పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కడవరకు ఎర్రజెండాను వీడని వ్యక్తి గుర్రం వెంకటేశ్వర్లు (Gurram Venkateswarlu) అన్నారు. 2010 అక్టోబర్ 8న గుండెపోటుతో మృతి చెందాడని గుర్తు చేశారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించుకొని ఆయన స్మారక స్థూపాన్ని స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసినట్లు పూర్తి చేశారు. 16 సంవత్సరాలుగా ఆయన వర్ధంతిని మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు.
తొలుత ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి బస్టాండ్ సెంటర్లోని స్మారక స్థూపం వద్దకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్, జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ, గుర్రం పుల్లారావు, మండల కార్యదర్శి గ్యానం వాసు, గుర్రం వెంకటేశ్వర్లు (Gurram Venkateswarlu) స్మారక స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను మాజీ జెడ్పిటిసి వంకారాములు ఆవిష్కరించారు. వర్ధంతి సభలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొప్పుల రఘుపతి, కుమ్మరి శీను, వెంకటరెడ్డి, దావూద్, చిట్టిబాబు, కట్ల చారి, కుమ్మరి శీను, పరిశిక రాంబాబు, పర్షిక కృష్ణ, గంగినబోయిన కృష్ణ, నరసింహారావు, తోట నాగేశ్వరరావు, దేవి, సత్యవతి, తదితర మండల నాయకులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
