Homeహైదరాబాద్‌Dasara Utsav | లీడ్ ఇండియా భారత్ రత్నాస్ స్కూల్‌లో దసరా ఉత్సవాలు

Dasara Utsav | లీడ్ ఇండియా భారత్ రత్నాస్ స్కూల్‌లో దసరా ఉత్సవాలు

దసరా పండుగను పురస్కరించుకుని బండ్లగూడలోని లీడ్ ఇండియా భారత్ రత్నాస్ స్కూల్ ఆధ్వర్యంలో అక్టోబర్ 9న ‘దసరా ఉత్సవ్’(Dasara Utsav) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 4:30 గంటల నుంచి 7:00 గంటల వరకు పాఠశాల గ్రౌండ్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. ధర్మం, సత్యం, మంచితనం చెడుపై సాధించే విజయాన్ని చాటిచెప్పేలా రామ్‌లీలాతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

తెలంగాణ సంస్కృతి, భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ, దాండియా వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొనేలా వేడుకలను రూపొందించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాధా రెడ్డి తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పే ఈ వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పాఠశాల యాజమాన్యం కోరింది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ప్రిన్సిపాల్ తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News