- కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకుల వినతి
కీసర సర్కిల్ పరిధిలోని చంద్రపురి కాలనీ, జవహర్నగర్ డివిజన్లలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) కోరారు. ఈ మేరకు చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, పుస్తక పఠనంపై ఆసక్తి ఉన్న యువతకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని నాయకులు తెలిపారు. రెండు డివిజన్లలో ప్రజలకు అందుబాటులో ఉండేలా గ్రంథాలయాలకు స్థలం కేటాయించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.

వినతిపై తోటకూర వజ్రేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి గ్రంథాలయాల ఏర్పాటుకు స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.Congress Leaders
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు గొడుగు వేణు, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, బల్లి శ్రీనివాస్, బింగి సతీష్ గౌడ్, మనోధర్ రెడ్డి, నాయకులు మాట్ల వినయ్ కుమార్, యాదగిరి యాదవ్, మాధవరెడ్డి, ఎర్రగుంట్ల వెంకటేష్, వీర్ల బుజ్జి, నాయకం భాస్కర్, నర మహేష్, బబ్లూ ముదిరాజ్, గజ్వేల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
