Homeరంగారెడ్డిNimajjanam Celebrations | పాటలతో అల్లరించిన మధుప్రియ.. శేరిగూడలో సందడి..

Nimajjanam Celebrations | పాటలతో అల్లరించిన మధుప్రియ.. శేరిగూడలో సందడి..

  • ఘనంగా కంఠమహేశ్వర యూత్ వినాయకుడి నిమజ్జనం
  • కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాళ్ల శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు..
  • ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని శేరిగూడలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. కంఠమహేశ్వర యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జనం వేడుకలను(Nimajjanam Celebrations) కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాళ్ల శ్రీశైలం గౌడ్(Talla Srisailam Goud) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి(Malreddy Ranga Reddy) ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

నిమజ్జనం వేడుకల్లో ప్రముఖ గాయని మధుప్రియ తన పాటలతో సందడి చేశారు. ఆమె ఆలపించిన పాటలకు యువత, భక్తులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు. గణనాథుడి శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాళ్ల శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. శేరిగూడలో నిమజ్జన వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సాహంగా ముగిశాయి.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

Madhupriya Sheriguda Ganesh Nimajjanam Celebrations1
- Advertisement -
RELATED ARTICLES

Latest News