- గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం. .
- పెడదారిన పడుతున్న యువత- వీధిన పడుతున్న కుటుంబాలు ..
- బార్లను తలపిస్తున్న- పర్మిట్ రూములు ..
- నిబంధనలు గాలికీవదులుతున్న మద్యం షాప్ నిర్వాహకులు …
- మామూళ్ల మత్తులో ఆబ్కారి శాఖ అధికారులు …
- ప్రభుత్వాలకు ఆదాయమే ముఖ్యమా ..?
- ప్రజా శ్రేయస్సు పట్టదా ..?
- నియంత్రణపై పోలీస్ శాఖ చర్యలేవి ..?
తాడ్వాయి: పచ్చని పల్లెల్లో బెల్ట్ షాపులు చిచ్చు పెడుతుంటే ఆపాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తోగుతున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బడి, గుడి, లేని ఊరు ఉంటుందేమో కానీ బెల్టు షాపు లేని ఊరంటు అంటూ లేదంటే అందులో అదే అతియా శక్తి లేదు. ప్రభుత్వాలు సైతం ఆదాయ మార్గాల పైన దృష్టి పెట్టుండం, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి పట్టించుకోవడం లేదని ఆరోపణలు ప్రజల నుండి బలంగా వినిపిస్తున్నాయి.
ఉదయం లేచిన నుండి రాత్రి పడుకునే వరకు బెల్ట్ షాప్(Illegal Belt Shops) లో పుణ్యమా అని యువత మద్యం మత్తులో తూగుతుంటే, వారిని కన్న తల్లిదండ్రులు బాధ వర్ణరాహితం. కొన్ని చోట్లా బెల్ట్ షాపులకు టెండర్లు వేసి, పోటీపడి మరి మద్యం షాపులు దక్కించుకొని విచ్చలవిడిగా మధ్య అమ్మకాలు విక్రాయిస్తుంటే నివారించాల్సిన అధికారులు మద్యం షాప్ నిర్వాహకులు ఇచ్చే మామూళ్ల మత్తులో తోగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాడ్వాయి మండలంలోని(Tadwai Mandal) అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో రెండు నుంచి మూడు బెల్ట్ షాపులు వెలిశాయి. కిరాణా షాప్ లు, హోటల్లు, అన్ని చోట్ల మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వేలం వేసి మరి బెల్టు షాపులు విక్రయిస్తుంటే వాటిని పోటీ పడి మరి దక్కించుకుని మద్యం విక్రయాలు చేపడుతున్నారు.
ఆప్కారి శాఖ ఆదేశాల ప్రకారం కేవలం ప్రభుత్వ నుండి లైసెన్స్ పొందిన వైన్ షాప్ లో మాత్రమే మద్యం అధికారికంగా విక్రాయించాల్సి ఉంది. కానీ వైన్ షాప్ నిర్వాహకుల ధన దాహం మూలంగా గ్రామాలలో ఉండే కిరాణా షాపులు, హోటల్లు కు మద్యం సరఫరా చేసి అక్కడ బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మడం నిషేధం, వాటిని నివారించాల్సిన అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణ వినిపిస్తున్నాయి.దీనికి మూల కారణం మద్యం దుకాణదారులు సిండికేట్లుగా ఏర్పడి ఆప్కారి శాఖ అధికారులకు నెలనెలా మామూలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

నిబంధనలు గాలికొదిన పర్మిట్ రూమ్.
ఆప్కారి శాఖ అధికారుల పర్యవేక్షణ ఎక్కడ.Illegal Belt Shops
మండల కేంద్రంలోని వైన్ షాపులో మైనర్లకు (21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ) గల వారికి మందు అమ్మబడదు అనే బోర్డులు పెట్టాలి. కాని అవి ఎక్కడ కనిపించడం లేదు. వైన్ షాప్ ఆనుకొని ఉన్న పర్మిట్ రూంలో నిబంధనకు విరుద్ధంగా, అమ్మకాలు జరుగుతున్న వాటిని పర్యవేక్షించాల్సిన ఆప్కారి శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ వినిపిస్తున్నాయి. నిబంధన ప్రకారం అక్కడ ఎలాంటి స్టవ్వులు, సిలిండర్లు, పెట్టి వంటలు చేసి, విక్రయించకూడదు.
పర్మిట్ రూంలో కేవలం మందుబాబులు నిల్చుని తాగడానికి మాత్రమే అనువైన టేబుల్స్ ఉండాలి. కానీ నిబంధన గాలికి వదిలి బార్లను తలపించే విధంగా టేబుల్స్, సెట్టింగ్లు, వేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఎంట్రీ ఎగ్జిట్ రెండు సపరేట్ గా ఉండాల్సిన పరిమిట్ రూంలో అవేవీ వుండవు, ఫస్ట్ యాడ్ బాక్స్, శానిటేషన్, త్రాగునీరు అందుబాటులో ఉంచాలి. కానీ అవి ఎక్కడ అమలు కావడం లేదు.
మౌనం వహిస్తున్న పోలీస్ శాఖ.Illegal Belt Shops
ఆప్కారి శాఖ తర్వాత శాంతి భద్రతల విషయం పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.గ్రామాలలో బెల్ట్ షాప్ లలో,డాబాలలో మద్యం విక్రయిస్తున్న చూసి చూడనట్టు పోలీస్ శాఖ వ్యవహారిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో బెల్ట్ షాపులపై దాడులు చేసి వారిపై కేసులు నమోదు చేయాల్సిన అధికారాలు పోలీసులకున్న అవి ఏమీ చేయడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నయి.వీరికి సైతం ప్రతినెల బెల్ట్ షాపులకు నిర్వాహకల నుండి మామూలు అందుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
