- నివాళులర్పించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
మండల పరిధిలోని బండాపోతుగల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ హుస్సేన్ మాతృమూర్తి ఖాజాబీ బేగం(87)మృతి చెందడం బాధాకరమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.ఆమె మృతి వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బండాపోతుగల్ గ్రామానికి చేరుకుని,ఖాజాబీ బేగం పార్థివదేహానికి నివాళులర్పించి (Tribute) శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం శోకసం ద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూ తిని తెలియజేశారు.ఖాజాబీ బేగం మృతికి గల వివరాలను అడిగి తెలుసుకు న్నారు.

ఈ తీరని విషాద సమయంలో ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని,వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే ప్రార్థించారు.అనంతరం ఫైజాబాద్ బీఆర్ఎస్ నాయకుడు రామస్వామి సుధాకర్ గౌడ్ మాతృమూర్తి రుక్కమ్మ గత ఐదు రోజులు క్రితం మరణించారని తెలుసుకున్న ఆమె వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు సారా రామాగౌడ్, సంగాగౌడ్,మధుసూదన్ రెడ్డి,ఎంసీ విట్టల్, నర్సింహారెడ్డి, షఫి, దుర్గారెడ్డి, గోపాల్ రెడ్డి, యాదగిరి, గోపాల్ రావు, మల్లారెడ్డి, తదితరులు పాల్గొని సయ్యాద్ హుస్సేన్ కుటుంబాన్ని పరామర్శించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
